పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన టీడీపీ, జనసేన, సీపీఎం నుంచి నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్దసంఖ్యలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనను మెచ్చి తామంతా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీలో చేరినట్టు ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ కుంబురుక దీనమయ్య, జెడ్పీటీసీ మండంగి రాధిక, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, లక్ష్మణరావు ఆధ్వర్యంలో కేదారిపురం, డుమ్మంగి, పెదఖర్జ, తోలుఖర్జ, ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం, లక్కగూడ, చాపరాయి బిన్నిడి గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో లక్కగూడ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నాయకుడు బోగపురపు నాగు, కురుపాం మండలం పి.లేవిడికి చెందిన పత్తిక మోహన్‌దాసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలకపాత్ర పోషించిన వై.తారకేశ్వరరావుతోపాటు విశ్రాంత ఉద్యోగులు పార్టీ లో చేరారు.