నరసన్నపేట మేజర్ పంచాయతీలో త్రాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన పైప్ మెయిన్ లైన్లు మరమ్మతులకు గురి అయ్యాయని పంచాయతీ ఈవో ఎస్ చిన్నారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ పలు ప్రాంతాలలో పైపుల ద్వారా అందిస్తున్న త్రాగునీరు నిలిచిపోవటం జరుగుతుందని స్థానిక ప్రజలు గుర్తించాలని సూచించారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు దేవాది వద్ద మెయిన్ లైన్లు మరమ్మత్తులు చేపడుతున్నామని ఆయన తెలియజేశారు.