తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి పార్టీల అభ్యర్థి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. జలుమూరు మండలం కరకవలస పంచాయతీలో బుధవారం ఆయన పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికలలో తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉమ్మడి పార్టీల నేతలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.