గడివేముల మండలంలోని ఆళ్లగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తి రెడ్డి పోగు విజయకుమార్(30) వ్యక్తి మద్యం తాగి మోటార్ సైకిల్ డ్రైవ్ చేసిన కేసులో మంగళవారం నాడు నంద్యాల సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 14 రోజుల జైలు శిక్ష వెయ్యడం జరిగింది. కావున గడివేముల మండల ప్రజలకు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షకు గురి అవుతారని ఎస్ఐ బిటి వెంకట సుబ్బయ్య హెచ్చరించారు.