సామాజిక న్యాయమంటే బడుగులను బలి తీసుకోవడమేనా జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం నంద్యాల టిడిపి కార్యాలయంలో ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదన్న విషయం చేనేత కుటుంబ బలవంతపు మరణంతో మరోసారి రుజువైందన్నారు. చేనేత కుటుంబం బలవంతపు మరణానికి ఏం సమాధానం చెప్తావ్ జగన్ ఇదేనా నువ్వు చెప్తున్నా సామాజిక న్యాయమని అన్నారు.