బాపట్ల జిల్లా, కొరిశపాడు మండలం, కోరిశపాడు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్. రాజేష్ బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ఉపాధి హామీ కూలీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, పనులు చేస్తున్న కూలీలు అందరికీ ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్స్ (ఓ. ఆర్. ఎస్) ను స్వయంగా అందించారు, ప్రతి ఒక్కరికి సరాసరి దినసరి వేతనం 272/- ఉండేటట్లు చూడాలని అధికారులని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa