ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 07:57 PM

ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహిస్తున్న ట్రాక్‌ పనుల దృష్ట్యా ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకూ విజయవాడ-విశాఖల మధ్య సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. గుంటూరు-విశాఖ (22701)ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్, 22702నంబరు గల విశాఖ-గుంటూ రుల మధ్య, 17219 నంబరు గల మచిలీపట్నం-విశాఖల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌లను ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 28 వరకూ రద్దు చేశారు. 17220 నంబరు గల విశాఖ-మచిలీపట్నంల మధ్య నడిచే రైలు ఏప్రిల్‌ 2 నుంచి ఏప్రిల్‌ 29 వరకూ రద్దు చేశారు.


ధన్‌బాద్‌-అలపూజ మధ్య నడిచే బొకారో ఎక్స్‌ప్రెస్‌ (13351) రైలు ఏప్రిల్‌ 1 నుంచి 28వరకూ నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడ చేరుతుంది. హతియా-బెంగుళూరు (12835)ల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడ చేరుతుంది. 18637 నంబరు గల హతియా-బెంగుళూరుల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుతుంది. హటియా-ఎర్నాకుళం (22837) ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 1, 8, 15, 22 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వస్తుంది.


టాటా-యశ్వంత్‌పూర్‌ (18111) ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 4, 11, 18, 25 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుతుంది. జాసిడ్‌-తాంబరమ్‌ (12376) ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ 3, 10, 17, 24 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు వెళుతుంది. బెంగుళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (12509) రైలు ఏప్రిల్‌ 3, 5, 10, 12, 17, 19, 24, 26 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌ల మీదుగా నిడదవోలు చేరుతుంది. ముంబై- భువనేశ్వర్‌ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ (11019) ఏప్రిల్‌ 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీలలో విజయవాడ,గుడివాడ, భీమవరం టౌన్‌ల మీదుగా నిడదవోలు వస్తుంది.


టాటా-ఎస్‌ఎంవీ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ (12889) రైలు ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీలలో నిడదవోలు, భీమవరం, గుడివాడల మీదుగా విజయవాడకు చేరుతుంది. ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ (22643) రైలు ఏప్రిల్‌ 12, 8, 15, 22 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరంల మీదుగా నిడదవోలు వస్తుంది. భావనగర్‌-కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్‌ (12756) రైలు ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీలలో విజయవాడ, గుడివాడ, భీమవరంల మీదుగా నిడదవోలు చేరుతుంది. మరిన్ని వివరాలకు సమీపంలో గల రైల్వే స్టేషన్‌ బుకింగ్‌ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com