ఏపీలో ఎండలు ముదురుతున్నాయి. గురువారం 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం 42 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు. కడప 18, నంద్యాల 8, పార్వతీపురం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో గురువారం అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 42.9 డిగ్రీలు, కొమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 42.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.