ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు. నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.