ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో సమీక్షలు నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల అంశాలపై ఆర్వో లు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రజల ఐడెంటిటీ రహస్యంగా ఉంచాలని ఆదేశించారు.