రాష్ట్రం బాగు కోసమే తాము ఎన్డీయేతో కలిశామని.. అయినా మైనారిటీల హక్కులకు ఢోకా ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. తమ హయాంలో మైనారిటీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ‘రంజాన్ మాసంలో హామీ ఇస్తున్నా.. ఒక కులం, ఒక మతం, ఒక వర్గానికి చెందిన వ్యక్తిని కాను. నేను అందరివాడిని’ అని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.