తాడిపత్రి పట్టణంలోని గాంధీనగర్ వార్డు వాలంటీరు దాదాపీర్ వర్గ కక్షలను ప్రేరేపించే విధంగా సామాజిక మాధ్య మాల్లో సమాచారాన్ని పంపుతూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఉల్లంఘిం చినందున కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రామమోహన్ రావు ఫిర్యాదు మేరకు అతన్ని విధులనుంచి తొలగించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.