తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం రాప్తాడులో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హమీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద రూ. 3వేలు ఇస్తానని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీ తెస్తానని పేర్కొన్నారు. పింఛన్‌ను రూ. 3 వేలు నుంచి 4 వేలు చేసి 50 సంవత్సరాలకే అందిస్తానని హమీలు ఇచ్చారు.