ఎన్నికల కోడ్ వచ్చి 12రోజులవుతున్నా కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాజకీయ నాయకుల ఫోటోలు, పోస్టర్లు, హోర్డింగ్లు ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసినప్పటికీ జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో పలుచోట్ల ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలున్న స్టిక్కర్లు, రంగులు ఉన్న భవనాలు దర్శనమిస్తున్నాయి.