కారేపల్లి సొసైటీ డైరెక్టర్ గిద్దవారిగూడేనికి చెందిన డేగల ఉపేందర్, కల్తీ అరుణ్ కుమార్ శుక్రవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు బానోత్ రాంమ్మూర్తి ఆధ్వర్యంలో ఖమ్మం వెళ్లిన డేగల ఉపేందర్, కల్తీ అరుణ్ కుమార్ కి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ హీరోలాల్ పాల్గొన్నారు.