హిందూపురం మండలం మరువపల్లికి చెందిన మారుతి(27) అనే యువకుని శవం వ్యవసాయ బావిలో లభ్యమైంది. అబ్ గ్రేడ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మరువపల్లికి చెందిన మారుతి ఈ నెల 26న ఇంటి నుంచి వెళ్లాడు. గురువారం లేఅవుట్లో పనిచేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి బావిలో ఉన్న శవాన్ని చూసి అక్కడున్నవారికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa