కంబదూరులోని వైయస్సార్ సర్కిల్ సమీపంలో ఉన్న కోటవీధిలో బాలుడు కిడ్నాప్ యత్నం గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర్ కుమారుడు గౌతమ్ కౌషిక్ తన తాతతో కలసి ఇంటి బయట మంచంపై పడుకున్నారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి తాత పక్కలో పడుకున్న పిల్లవాడి చేయి లాగడంతో వెంటనే మెలకువలో ఉన్న ముసలాయన కేకలు వేయడంతో పిల్లవాడిని వదిలి పరాలయ్యారన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.