కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గోవిందరాజులు శుక్రవారం ఉప్పొంక గ్రామ సమీపంలో ఉన్న తన పొలంలో పనులు చేస్తున్నాడు. ఆ సమయంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా అతడి పై దాడి చేసింది. గమనించిన పక్క పొలాల రైతులు కేకలు వేయడంతో ఎలుగుబంటి బెదిరి అటవీ ప్రాంతంలోకి పరుగు తీసింది. తీవ్రంగా గాయపడిన గోవింద రాజులును వెంటనే సి. హెచ్. సి తరలించారు. రైతులు రాత్రి పూట పొలాల్లోకి వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.