బాబూ మోహన్‌కి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని, పార్టీ మారిపోయారని శుక్రవారం ఉదయం నుంచి ఓ వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్త తప్పని, నేను ప్రజాశాంతి పార్టీలో ఉన్నానని ఆయన విశాఖలో స్పష్టం చేశారు. వరంగల్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. బాబు మోహన్ తెల్లని కాగితం వంటి వాడు అని స్పష్టం చేశారు. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ కేఏ పాల్ అంటే మీకు ఎందుకు భయం అని ప్రశ్నించారు.