లక్ష్యానికి మించి మద్యం విక్రయాలు చేపట్టే షాపులకు అధికారుల మెమోలు జారి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణాకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేస్తుంది. గత ఏడాది ఈ తేదీకి ఎంత మద్యం విక్రయించారో అంతకుమించి ఈ ఏడాది మద్యం విక్రయాలు చేపట్టొద్దని షాపులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పరిమితికి మించి మద్యం విక్రయాలు చేస్తున్న షాపు లను మూసి వేస్తున్నారు. ఈ నేపద్యంలో బుచ్చయ్యపేట లో మద్యం షాప్ ను కూడా శుక్రవారం మూసివేసారు.