మాడుగుల మండలం జంపెన గ్రామంలో టిడిపి, జనసేన పార్టీ లను వీడి 14 కుటుంబాలు ఆ గ్రామ సర్పంచ్ నేమాని గురువునాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం వైసీపీ లోకి చేరగా వారికీ
ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లే అనురాధ తారువ కార్యాలయంలో కండువాలు వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగనన్న నాయకత్వంలో డిప్యూటీ సీఎం, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి నాయకత్వం అవసరమని భావించి వారంతా పార్టీ లోకి చేరడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.