చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో ఎద్దు యోహాను (35) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. యోహాను భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లుగా ప్రాథమిక సమాచారం. శుక్రవారం చిలకలూరిపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa