కలికిరి జేఏసీ వ్యవస్థాపకులు హనీఫ్ ఆధ్వర్యంలో 50 ముస్లిం కుటుంబాలు వైకాపాలో చేరాయి. శుక్రవారం కలికిరిలో జరిగిన వైసిపి సమావేశానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏపీఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మెన్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్, ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు.