సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్ ఏర్పాట్లపై గుంటూరు జిల్లా అధికారులు దృష్టి సారించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటారు. సచివాలయం ఉద్యోగికి కేవలం ఓటర్లకు సిరా మార్కును వేసే బాధ్యతను అప్పగిస్తారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పోలింగ్ బాధ్యతలను అప్పగించాలని అధికారులు నిర్ణయించారు.