తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, ఉచిత సర్వ దర్శనం కోసం భక్తులు బయట క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులందరికీ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.
నిన్న శ్రీవారిని 60 వేల 958 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.