లోక్‌సభ ఎన్నికలు-2024లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. బాబు మోహన్ వరంగల్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని కేఏ పాల్ ఆరోపించారు. ప్రజా సేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని అన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో బాబు మోహన్‌తో కలిసి కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![]() |
![]() |