నూజివీడులో వాహనంలో తరలిస్తున్న రూ.5.30 లక్షలను నూజివీడు పట్టణ సీఐ మూర్తి స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద నిర్వహిస్తున్న సాధారణ తనిఖీల్లో ఆధారాలు చూపని నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. విజయ డెయిరీ వాహనంలో ఈ నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఆధారాలు చూపి నగదును తీసుకువెళ్ళవచ్చని లేనిపక్షంలో ఈ నగదును ఉన్నతాధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.
![]() |
![]() |