పేదలకు అండగా నిలిచేది జగన్ ప్రభుత్వమేనని స్థానిక జడ్పిటిసి దొండా రాంబాబు అన్నారు. శనివారం బుచ్చయ్యపేట మండలంలోని నీలకంఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మశ్రీ కి మద్దతుగా ఆ పార్టీ మండల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటి కి తిరిగి సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. ఫ్యాన్ గుర్తుల పై ఓటు వేసి ధర్మశ్రీ, బూడి లను గెలిపించాలని కోరారు. ఎంపీపీ, మండల ఇంచార్జ్ శేషు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |