ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ నూకా నాగేంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆయన సతీమణి, కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తు ఓట్లు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వూరు రమేష్ రెడ్డి, కోటవీధి రమేష్, తదితరులు పాల్గొన్నారు.