పులివెందుల మున్సిపల్ చైర్ మెన్ వరప్రసాద్ సేవలు ప్రశంసనీయమని వైఎస్ఆర్సిపీ ముస్లిం అధ్యక్షుడు నూరుల్లా, రాష్ట్ర నూర్ బాషా కార్పొరేషన్ చైర్ మెన్ రసూల్లు అన్నారు. పులివెందులలోని జామియా మసీదు వద్ద శుక్రవారం 70మంది పేద ముస్లింలకు వరప్రసాద్ సొంత డబ్బులతో రంజాన్ తోపా సరుకులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది ముస్లింలకు రంజాన్ తోపా సరుకులు అందిస్తూ మన్ననలు పొందుతున్నారని తెలిపారు.