మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం కలికిరికి వస్తున్నట్లు పిఏ కృష్ణప్ప తెలిపారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం బిజెపి, టిడిపి, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. దీంతో ఆయన కలికిరి పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. మాజీ సీఎంకు ఘనంగా స్వాగతం పలకడానికి బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన నేరుగా కలికిరికి రానున్నారు.