ఎచ్చెర్ల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి నడుకుదిటి ఈశ్వరరావు పేరు ఖరారు చేయడాన్ని అసమ్మతి నేత, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు ఖండించారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఎచ్చెర్లలో ఓసీ అగ్రకులానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరమన్నారు.