చిత్తూరులో ఓ ఏనుగు రోడ్డుపై హల్ చల్ చేసింది. ఆదివారం ఉదయం పలమనేరు ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఓ ఏనుగు వచ్చింది. దాన్ని చూసి స్థానికులు భయాందోళన చెందారు. అది పలమనేరు వద్ద బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిని దాటడానికి ప్రయత్నించింది.
వాహనాల రద్దీ కారణంగా రోడ్డు దాటలేకపోవడంతో అక్కడే తిష్ట వేసింది. ఏనుగును వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa