పామూరు మండలంలోని బొట్లగూడూరు చెక్ పోస్టు వద్ద సోమవారం ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను సోమవారం ఎస్సై సైదుబాబు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సైదుబాబు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమ మద్యంను తరలిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.