శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం గ్రామంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో మంగళవారం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన తనయుడు, యువనేత రామ్ మనోహర్ నాయుడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ను మరోసారి సీఎంగా గెలిపించాలని కోరారు.