ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరో వైపున ఉన్నాయి అని సీఎం జగన్ అన్నారు. అయన మాట్లాడుతూ..... ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరో వైపున. మంచి ఓవైపున, చెడు మరో వైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరో వైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న ఘడియలు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటి అభివృద్ధి, ఇంటింటి మంచి, పిల్లల భవిష్యత్తు కోసం సత్యనిష్టతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి ప్రభుత్వం మంచి చేసి ఓవైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు.. గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా.. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి.. వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు అని తెలిపారు.