ఇజ్రాయెల్‌లో హై అలెర్ట్ నడుస్తోంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై దాడులు చేయొచ్చనే ప్రచారం మొదలైంది. దీంతో తమ దేశంలోని జీపీఎస్ నావిగేషన్ సేవలను ఇజ్రాయెల్ ఆర్మీ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ప్రజల కోసం సురక్షితమైన పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని సమాచారం.