రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్ధానాలను గెలవాలన్న లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగింది. క్లీన్‌స్వీప్ సాధించే దిశగా.. నెల్లూరు జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్ధానాలు గెలవాలన్న టార్గెట్ తో నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం స్టే పాయింట్ వద్ద 8 బై 8 టీషర్ట్ మీద వైయస్‌ఆర్‌సీపీ స్టాంప్‌ను ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి వేసి పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు గుర్రంపాటి దేవేంద్రారెడ్డి, హర్ష, సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.