2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండదని అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ శనివారం ప్రకటించారు. 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ ఉండదు.. జనతాపార్టీ, సీపీఐ, సీపీఐ(ఎం) లాగా కాంగ్రెస్ పార్టీ పేరుగానే మిగిలిపోతుంది. గౌహతిలోని రాజీవ్ భవన్‌కు వెళ్లి చూస్తే.. అక్కడ గదులు ఖాళీగా కనిపిస్తున్నాయి అని అస్సాం సిఎం అన్నారు.కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవ్ గొగోయ్ ఒంటరిగా ప్రచారం చేయడం గురించి అడిగిన ప్రశ్నలకు శర్మ స్పందిస్తూ, "కాంగ్రెస్ ఇప్పుడు నాయకులతో మాత్రమే కాకుండా అట్టడుగు స్థాయి కార్యకర్తలతో కూడా తక్కువగా ఉంది.ఏప్రిల్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నల్బరిలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.అస్సాంలో మొత్తం 14 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. అస్సాంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.