కొరిసపాడు మండలం కొరిసపాడు జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుండి రైల్వే కోడూరు వెళుతున్న కారు 16వ నెంబర్ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి డివైడర్ ను ఢీ కొని లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదు సంవత్సరాల పాప అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.