వలేటివారిపాలెం మండలం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శనివారం వివిధ కేటగిరీల క్రింద రూ. 8,62,544 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అందులో ప్రధానంగా అన్నదానం వలన రూ3,66, 029 ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 1,81,100 లడ్డు ప్రసాదం కింద రూ. 1,74, 865తలనీలాల ద్వారా రూ. 27,400 విరాళాల ద్వారా రూ.48 వేలు ఇతరములు ద్వారా రూ. 92,500 ఆదాయం సమకూరిందని తెలిపారు.