రేపల్లె రూరల్ మండలం పెనుమూడి గ్రామంలో సఖి ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రేపల్లె ఆర్డిఓ హేలా షారోన్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కుల, మత, లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తహసిల్దార్ చొప్పా రవీంద్ర పాల్గొన్నారు.