కందుకూరు పట్టణంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి శనివారం రాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కావలిలో సిద్ధం మహాసభ ముగించుకొని జువ్వుగుంట కు వెళ్తూ కందుకూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ చేరుకున్న ఆయనకి కందుకూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ కనిగిరి రహదారి జన సందడితో కలకల్లాడింది.