బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి మండలాల్లో నేను సిద్ధం-బూత్ సిద్ధం కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులు మల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఉమామహేశ్వరనాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతాంగం బాగుకు ఎంతో ఉపయోగకరమైన 114చెరువులకు అనుసంధానమైన కాలువలు తవ్వకుండా కాలయాపన చేసి అన్నదాత నోట్లోమట్టి కొట్టింది సురేంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.