హిందూపురం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హిందూపురం పట్టణంలోని ఆజాద్ గర్లో స్పెషల్ పార్టీ పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఆధారాలు లేకుండా రూ. 2. 20 లక్షలను ఓ వ్యక్తి తరలిస్తుండగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే లేపాక్షి మండలం చోళసముద్రం వద్ద తనిఖీల్లో రూ. 1. 20 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.