వైసీపీ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ ఆ పార్టీ పదవికి రాజీనామా చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ నాయకుడు కార్తీక్ శుక్రవారం రాత్రి హిందూపురం పట్టణంలో టపాసులు పేల్చి మద్దతు తెలిపాడు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ యువజన జిల్లా అధ్యక్షులు వాల్మీకి లోకేష్తోపాటు అమర్నాథ్ రెడ్డి, హోటల్ సుధీర్, సాయికిరణ్ గౌడ్, శెక్షా, హరేంద్రనాథ్, మధుసుధన్, భాస్కర్, తిరమలేష్ కార్తీక్ వద్దకు వెళ్లి టపాసులు ఎందకు కాల్చారని దాడి చేశారు.