ధర్మవరం పట్టణంలో వన్ టౌన్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వేణుగోపాల్ అనే వ్యక్తిని ఎటువంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 92వేల నగదును పోలసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆ నగదును పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఎవరైనా అక్రమంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల కంటే ఎక్కువ డబ్బులు కలిగి ఉన్న చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.