బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన వ్యవసాయ కూలీ దూదేకుల దస్తగిరి (55) అనే వ్యక్తి ఆటో ప్రమాదంలో మృతి చెందినట్లు నందివర్గం ఎస్సై తిరుపాలు శనివారం తెలిపారు. దస్తగిరితోపాటు మరి కొంత మంది వ్యవసాయ కూలీలు పలుకూరు నుంచి మిరపకాయలు తెంచేందుకు తిమ్మాపురం ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ దస్తగిరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.