బనగానపల్లె నియోజకర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. శనివారం సంజామల మండలం గిద్దలూరు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీని విడి టీడీపీలో చేరారు. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడు బత్తుల ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కాటసాని పరమేశ్వర్ రెడ్డి, కాటసాని రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, గుల్లదుర్తి సుబ్బయ్య, శిఖామణిలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.