శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముస్లిం స్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి వలి ఉల్లా శిష్యులు ముస్లిం సోదరుల మధ్య చెలరేగిన గొడవ తారా స్థాయికి చేరింది. వీటిని అదుపు చేయడానికి వెళ్లిన ఏఎస్ఐ, స్పెషల్ పార్టీ పోలీసులపై వలీ ఉల్లా శిష్యులు దాడి చేసి రక్త గాయాలు చేసి పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో పలువురు పోలీసులను హిందూపురం ప్రభుత్వసపత్రికి తరలించి చికిత్స అందించారు.